తెలుగు హీరోలు, నిర్మాతలు, దర్శకులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ కొన్ని రోజులుగా వార్తల్లో వ్యక్తిగా మారిన నటి శ్రీరెడ్డిపై తెలుగు నటుడు పింగ్ పాంగ్ సూర్య ఫైర్ అయ్యారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కేవలం పబ్లిసిటీ, ఫేం కోసమే ఆమె ఇదంతా చేస్తోంది అంటూ సూర్య మండి పడ్డారు. ఆమె కనబడితే మొత్తం అందరూ చెప్పులతో కొట్టేట్లు ఉన్నారు. ఆమె ఇండస్ట్రీని దిగజార్చి రోడ్డు మీదకు తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు.
వాళ్లు వాడుకున్నారు, వీళ్లు వాడుకున్నారు అని చెబుతోంది. ఇందులో ఎంత వరకు నిజం అనేది ఎవరికీ తెలియదు. ఆమె వద్ద ప్రూఫులు ఏమీ లేవు. కేవలం ఫేం కోసం వేలాడుతూ ఇదంతా చేస్తోంది. ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసుకుని అందరినీ బదనాం చేస్తోంది. ఆమె ఇలా చేయడం కరెక్ట్ కాదు... అని సూర్య అన్నారు.