బిగ్ బాస్ ఫేం నటి ఆభరణాల చోరి కేసు లో అరెస్ట్

2018-07-19 3

నిజా నిజాలతో సంబంధం లేకుండా మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరగడం రోజురోజుకూ ఎక్కువవుతోంది. హిందీ మీడియా ఛానల్స్ లో బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్ గురించి నేడు టివి ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ ప్రసారం జరుగుతోంది. హీనా ఖాన్ 12 లక్షల విలువైన ఆభరణాలు మాయమైన కేసులో ఆమె నిందితురాలేది ఈ వార్తల సారాంశం. ఈ వార్తలపై హీనా ఖాన్ ఎలా స్పందించింది, నిజా నిజాలు ఏంటి.. ఇప్పుడు తెలుసుకుందాం.
టివి నటిగా మంచి గుర్తింపు పొందిన హీనా ఖాన్ బిగ్ బాస్ 11 తో మరింతగా పాపులర్ అయింది. కుర్రాళ్లకు గాలం వేసే హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటుంది.
బాలీవుడ్ మీడియా, హిందీ న్యూస్ ఛానల్స్ లో హీనా ఖాన్ గురించి ఓ హాట్ న్యూస్ ప్రసారం జరుగుతోంది. ఓ జ్యువెలరీ షోరూంలో రూ లక్షల విలువైన ఆభరణాలు కనిపించకుండా పోయిన కేసులో హీనా ఖాన్ నిందితురాలట. ఈ మేరకు ఆమెకు నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది.

Videos similaires