India Vs England 3rd ODI: Shardul Thakur Speaks About his Innings

2018-07-19 13

రెండు వన్డేల్లో టీమిండియా తరపున తొలి సిక్సును బాది ఇన్నింగ్స్‌లో చక్కని స్కోరును అందించిన శార్దూల్ ఇంగ్లాండ్‌కు భారీ పరుగులు అందించాడు శార్దూల్. అంతకు ముందు వరకు రిజర్వ్‌ బెంచీకి పరిమితమై సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆడటం అంత సులువేం కాదని టీమిండియా బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అన్నాడు. సిద్ధార్థ్‌ కౌల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిని అనుభవించాడు. 10 ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చాడు.'సిరీస్‌ చివరి మ్యాచ్‌లో అవకాశం వచ్చినప్పుడు జట్టుకు విజయం అందించాలనే ప్రతి ఆటగాడి మనసులో ఉంటుంది. ఈ మ్యాచ్‌యే కాదు.. ఎలాంటిదైనా సరే, భారత్‌, భారత్‌-ఏ లాంటి ఏ జట్టుకైనా సరే. మ్యాచ్‌ ఓడిపోవడం దురదృష్టకరం. మొత్తంగా చూస్తే మేం బాగానే ఆడాం. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ టీ20, వన్డే సిరీస్‌ నుంచి బ్యాట్స్‌మెన్‌ నేర్చుకుంది చాలా ఉపయోగపడుతుంది.'