యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తిని వీడియో తీసి తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన నటి, యాంకర్ అనసూయ ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వారి వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలా రూల్స్ అతిక్రమించే వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం లేదు అనే మీనింగ్ వచ్చేలా అనసూయ తన ఇంటెన్షన్ వ్యక్తం చేశారు. అయితే కొందరు తప్పు చేసిన ఆ డ్రైవర్‌ను వెనకేసుకొస్తూ.... అనసూయ మీద విరుచుకుపడటంతో ఆమె ఘాటుగా స్పందించారు.
అనసూయగారు కంప్లయింట్ చేశారు, మంచి పనే అనుకుందాం. కానీ ఒక్క నిమిషం మీ ఆడి క్యూ 7 కారు విండో దించి అతడికి చెప్పి ఉండొచ్చు. మీరు ఇప్పుడు కంప్లయింట్ చేయడం వల్ల పోలీసులు అతడి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే అతడికి ఆదాయం ఎలా వస్తుంది? ఎలా బ్రతుకు తాడు?' అని ఓ వ్యక్తి చేసిన కామెంటుపై అనసూయ ఘాటుగా స్పందించారు.