Bigg Boss Season 2 Telugu:Hebah Patel Responds On Re Entry To Bigg Boss

2018-07-19 728

It is heavily rumored that Hebah Patel will be the wild-card contestant for the Bigg Boss Telugu 2nd season. Putting an end to all the speculations, Hebah finally opened up on the rumours and clarified everyone that she is not going to be a part of the TV show.


బిగ్ బాస్ తెలుగు 2 రియాల్టీ షోకు బుల్లితెర ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊహించని పరిణామాలు, ఎక్స్‌పెక్ట్స్ చేయని టాస్క్‌లు, ఆడియన్స్ షాకయ్యే ఎలిమినేషన్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆసక్తికర మలుపులతో ఈ‌షో దూసుకెళుతోంది. ఈ రియాల్టీ షోను మరింత రక్తికట్టించడంలో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో గ్లామరస్ బ్యూటీని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారని, ఆవిడ మరెవరో కాదు.... హీరోయిన్ హెబ్బా పటేల్ అంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా హెబ్బా స్పందించారు.
"నేను మా ఇంట్లోనే వున్నా .. మరే ఇంట్లో లేను .. ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదు" అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి తాను వెళుతున్నాను అనే వార్తలకు ఆమె తెరదించారు.
కొన్ని రోజులుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి బిగ్ బాస్ ఇంట్లో మరింత గ్లామర్ యాడ్ చేయడానికి ఎవరిని రంగంలోకి దింపుతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో నవదీప్, దీక్షా పంత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరై అందరినీ ఎంటర్టెన్ చేసిన సంగతి తెలిసిందే.