Bigg Boss Season 2 Telugu : Elimination Process Leaked

2018-07-18 6,452

Bigg Boss 2 Telugu 36 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Now Samrat Reddy, Tejaswi romance become hot topic in the show. Samrat, Deepti, Tanish, Roll Rida, Tejswi naminated for this week elimination. But one document related to elimination was in social media. That goes viral in media circles.
#BiggBoss2Telugu

బిగ్‌బాస్ హౌస్‌లో లీకులు పర్వం యదేచ్ఛగా సాగుతున్నది. ఇప్పటి వరకు బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే సమాచారం మాత్రమే బయటకు వచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందేసి ఈ వారం ఎవరు బలహీనమైన అభ్యర్థి, ఎవరు అవుట్ కానున్నారనే విషయాన్ని వెల్లడించే ఓ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చాలా పకడ్బందీగా, సీక్రెట్‌గా కొనసాగే ఈ రియాలిటీ షో నిబంధనలకు విరుద్ధంగా ముందే బజారున పడటం స్టార్ మా నిర్వాహకులకు తలనొప్పిగా మారింది.
ఐదోవారంలో పేరున్న సెలబ్రిటీలే నామినేట్ కావడంతో షో మరింత ఆసక్తిగా మారింది. దీప్తి నల్లమోతు, రోల్ రైడా, సమ్రాట్ రెడ్డి, తనీష్ అల్లాడి, తేజస్వి మదివాడ నామినేషన్ లిస్టులో ఉన్నారు. వీరిలో ఒకరు తప్పనిసరిగా ఎలిమినేట్ కావాల్సి ఉంది.