Ram Charan,Boyapati Srinu's Movie Got Intresting News

2018-07-18 1

Interesting update on RamCharan movie. Boyapati completes 60 percent of shoot
#RamCharanmovie

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. బోయపాటి సినిమా అంటే మాస్ ఆడియన్స్ కు పండగే అని చెప్పొచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ కేక పెట్టించే విధంగా ఉంటాయి. ఈ చిత్రంలో కూడా పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర ఇతర విశేషాల గురించి జరుగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది.
మీడియా, సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రాంచరణ్, బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ ఆగష్టు 15 న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ కూడా అప్పుడే ప్రకటిస్తారు. రాంచరణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.
బోయపాటి సినిమా అంటే ఇంట్రవెల్ బ్యాంగ్ అదిరిపోవాల్సిందే. అద్భుతమైన ట్విస్ట్, భారీ యాక్షన్ తో ఈ చిత్రంలో ఇంట్రవెల్ సన్నివేశాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. రాంచరణ్ హీరోయిజాన్ని మరో లెవల్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.