టాలీవుడ్‌లోనే కాకుండా టెలివిజన్ ఇండస్ట్రీలో మంచు లక్ష్మీ తనదైన ముద్రతో రాణిస్తున్నారు. నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా, హోస్ట్‌గా విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. అంతకంటే ముందు గృహిణిగా చక్కటి బాధ్యతను పోషిస్తున్నారు. సౌమ్యతకు మంచి పేరున్న మంచు లక్ష్మీ ఇటీవల నెటిజన్లపై ఫైర్ అయ్యారు. ఇంటర్నెట్‌లో తనను, తన కుటుంబాన్ని రకరకాలుగా ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫ్ ఆఫ్ రామ్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా లక్ష్మీ మంచు మాట్లాడుతూ తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు.
సోషల్ మీడియాలో నాపై కామెంట్లు చేస్తూ ట్రోల్ చేయడం నా దృష్టికి వస్తుంటాయి. వాటిలో కొన్నింటిని ఎంజాయ్ చేస్తుంటాను. నా వ్యక్తిగత ప్రతిష్ట, జీవితానికి భంగం కలుగకుండా, నా కుటుంబ పరువు తీయకుండా ఉండే వరకు నాకు ఓకే అని మంచు లక్ష్మీ అన్నారు.