Leeds, July 17: Skipper Eoin Morgan (88*) and their in-form batsman Joe Root (100*) shined with the bat as clinical England crushed India by 8 wickets in the third and deciding one-day international and clinched the series 2-1 here on Wednesday (July 17).
#kohli
హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో మూడు వేల పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో 15 పరుగులు పూర్తి చేయగానే కెప్టెన్‌గా అతి తక్కువ వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 49 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
డివిలియర్స్ వన్డేల్లో కెప్టెన్‌గా 60 ఇన్నింగ్స్‌లో మూడు వేల పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో ధోనీ(70 ఇన్నింగ్స్), సౌరవ్ గంగూలీ(74), గ్రేమ్ స్మిత్/మిస్బా వుల్ హక్ (83), సనత్ జయసూర్య/రికీ పాంటింగ్ (84) మ్యాచుల్లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.