పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: ఏకమైన విపక్షాలు, కీలక బిల్లులపై చర్చ

2018-07-17 375

Leaders of 13 opposition parties met on Monday to discuss their strategy for the Monsoon Session of Parliament beginning on Wednesday and said that the government should allow them to raise their issues to ensure smooth functioning of Parliament.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఉభయ సభలను కొనసాగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తప్పులను గట్టిగా ఎత్తి చూపించాలని పదమూడు ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, అయితే ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదనే భావన కలుగుతోందని రాజ్యసభ ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ తెలిపారు. పార్లమెంటులోని ఆజాద్ కార్యాలయంలో విపక్షాలకు చెందిన సీనియర్ నాయకులు సోమవారం సమావేశమై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు.
సమావేశానంతరం మీడియాతో ఆజాద్ మాట్లాడుతూ.. పార్లమెంటులో ఏ అంశాలను లేవనెత్తాలనేది నిర్ణయించామని, మంగళవారం ప్రభుత్వం ఏర్పాటుచేసే అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావిస్తామని చెప్పారు. ఉభయ సభలు సజావుగా కొనసాగాలంటూ పదమూడు ప్రతిపక్షాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయని ఆజాద్ చెప్పారు. గత పార్లమెంటు సమావేశాలు కూడా సజావుగా కొనసాగాలని ప్రతిపక్షాలు కోరుకున్నాయి అయితే ప్రభుత్వం సభా కార్యక్రమాలకు అడ్డుపడి ప్రతిపక్షాలను అపఖ్యాతిపాలు చేశాయని ఆజాద్ ఆరోపించారు. అధికార పక్షానికి చెందిన కొన్ని పక్షాలు వ్యవహరించిన తీరు మూలంగానే గత పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగలేదని ఆయన చెప్పారు.

Free Traffic Exchange

Videos similaires