Bigg Boss Season 2 Telugu : Elimination Process Get Leaked

2018-07-16 1,727

Bigg Boss 2 Telugu Day 27 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Samart Reddy become first captain for bigg boss2 season. Now Samrat Reddy, Tejaswi romance become hot topic in the show. On weekend show, elemination details coming in the media before the show. So this incident making worry for Bigg Boss unit.

బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఏ భాషలోనైనా విజయవంతం కావడానికి కారణం సస్పెన్సే. ఆ కారణంగానే ఆ గేమ్ షోపై ఆసక్తి పెరిగిందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ తెలుగు బిగ్‌బాస్‌ ఎలిమినేషన్ రిజల్ట్ ముందే వచ్చేస్తుంది. దాంతో ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇలా బిగ్‌బాస్ ఇంటి నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ కావడానికి ప్రధాన కారణాలు ఇవేననే మాట వినిపిస్తున్నది.
బిగ్‌బాస్ తెలుగుకు సంబంధించిన రెండు ఫలితాలు ఇటీవల మీడియాలో లీకయ్యాయి. సాయంత్రం షో ద్వారా తెలిసే న్యూస్ కొన్ని గంటల ముందే మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల శ్యామల ఎలిమినేషన్, భానుశ్రీ నిష్ర్కమణ వార్తలు ముందే మీడియాలో వెలుగు చూశాయి.
గతంలో బిగ్‌బాస్‌ రియాలిటీ షో సెట్ ముంబైకి సమీపంలోని లోనావాలాలో వేసినప్పుడు చాలా పకడ్బందీగా నిర్వహించారు. ఇంటి నుంచి చిన్న సమాచారం కూడా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. దాంతో రియాలిటీ షోపై మంచి ఆసక్తి పెరిగింది.