Former India off-spinner Ramesh Powar has been appointed the interim coach of the national women's cricket team until the BCCI finds a suitable replacement for Tushar Arothe. Arothe was forced to resign in the wake of differences with senior players who were not happy with the coaching methods of former Baroda all-rounder.
#india
#cricket
#rameshpowar
#bcci
మెగా ఈవెంట్ల ముందే ఇలా క్రీడాకారిణుల మాట విని కోచ్‌ను తొలగించడం సరికాదంటూ కొందరు విమర్శకులు వినిపించిన వాదనకు బీసీసీఐ చెక్ పెట్టింది. పలు ఫిర్యాదులను ఎదుర్కొంటూ తానంతట తానే టీమిండియా కోచ్ బాధ్యతల నుంచి తప్పకున్న తుషార్ అరోథె స్థానంలో రమేశ్ పవార్‌ను తీసుకుంటోన్న నిర్ణయాన్ని బీసీసీఐ వెల్లడించింది.కొద్ది రోజుల క్రితం భారత్ మహిళల జట్టు కోచ్ తుషార్ ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ క్రీడాకారిణులు కోచ్ పద్ధతి సరిగా లేదంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో తుషార్ రాజీనామా చేశారు. దీంతో మహిళల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్‌ను ఎంచుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జులై 25 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మిథాలీ సేన శిక్షణ తీసుకోనుంది.