బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు

2018-07-16 1,634

బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి 3 సిరీస్ గ్రాన్ టురిస్మో బేస్ వేరియంట్ 320డి జిటి స్పోర్ట్ కారును లాంచ్ చేసింది. సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ ప్రారంభ ధర రూ. 46.60 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ చూడటానికి అచ్చం లగ్జరీ లైన్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఎమ్ స్పోర్ట్ తరహాలోనే ఉంటుంది. బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ ఫ్రంట్ డిజైన్‌లో శాటినైస్డ్ అల్యూమినియం ఫినిషింగ్ గల ఎయిర్ ఇంటేకర్ మరియు హై గ్లాస్ బ్లాక్ 9-స్లాట్ కిడ్నీ గ్రిల్ ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఎమ్ స్పోర్ట్ వేరియంట్ నుండి సేకరించారు.

Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2018/bmw-3-series-gran-turismo-sport-launched-india-at-46-60-lakh-specifications-features-images-012286.html

#BMW #BMWGTSports