కాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్లో పలువురు భాగోతాలు బయట పెట్టిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ప్రముఖుల కాస్టింగ్ కౌచ్ రహస్యాలు బయట పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏఆర్ మురుగదాస్, శ్రీకాంత్, రాఘవ లావరెన్స్ లాంటి వ్యక్తులను ఉద్దేశించి ఆరోపణలు చేయడం ద్వారా కోలీవుడ్లోనూ ప్రకంపణలు మొదలయ్యేలా చేసింది. తాజాగా శ్రీరెడ్డి తమిళ దర్శకుడు, ప్రముఖ నటి ఖుష్భూ భర్త సుందర్ సి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
అరణ్మయి మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గణేష్ నుండి ఫోన్ వచ్చింది. అతడు నన్ను సుందర్ సితో పరిచయం చేశాడు. ఆ సమయంలో సుందర్ తన తర్వాతి సినిమాలో లీడ్ రోల్ అవకాశం ఇస్తానన్నాడు. ఇందుకోసం నన్ను సెక్సువల్‌గా కాంప్రమైజ్ కావాలని అడిగాడు అని శ్రీరెడ్డి తెలిపారు.