ఫాన్స్ ని సోషల్ మీడియా లో అలరించిన కేటీఆర్

2018-07-16 445

Telangana IT Minister Kalvakuntla Taraka Rama Rao responded for woman netizen that 'How dare I'.
#KTR

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ ద్వారా నెటిజన్లు వేసిన ప్రశ్నలకు దాదాపు రెండు గంటల పాటు సమాధానాలు ఇచ్చారు. ఆయన సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆదివారం ట్విట్టర్ చాట్‌లో పాల్గొని, నెటిజన్ల పలు ప్రశ్నలకు స్పందించారు.
తనకు ఇష్టమైన రోడ్డు సైడ్ ఫుడ్ బండి మీది ఫుడ్ అని కేటీఆర్ చెప్పారు. చైనీస్ ఫుడ్ కూడా ఇష్టమే అన్నారు. ప్రజల కోసమైనా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంతర్గత కుమ్ములాటలు మానుకోవాలని, లేదంటే శాశ్వతంగా ప్రతిపక్షంలో మిగిలిపోతారని, మీరేమంటారని కేటీఆర్‌ను రఫి అనే నెటిజన్ ప్రశ్నించగా.. వారు అలాగే ఉండాలని కోరుకుంటున్నానని సరదాగా అన్నారు.
సర్.. మీరు అమ్మాయిలకు రిప్లై ఇవ్వట్లేదు అని సౌమ్య అనే నెటిజన్ ప్రశ్నించగా.. నాకు అంత ధైర్యం ఉందా అన్నారు. మీకు ఇష్టమైన బీర్ ఏది అని ఓ నెటిజన్అడగగా... దానికి సమాధానం చెప్పలేమన్నారు. మోడీ లేదా రాహుల్ గాంధీ? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అది సరే ప్రశ్న ఏది అని సరదాగా వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా కలిసి లంచ్ చేద్దామా అని ఓ నెటిజన్ అడిగితే.. సాధారణంగా నేను లంచ్ తినను అని సరదాగా సమాధానం ఇచ్చారు.