Sri Reddy Requests KCR To Give Security

2018-07-16 625

కాస్టింగ్ కౌచ్, సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న శ్రీరెడ్డి.... పలువురు తెలుగు సినిమా స్టార్లు, దర్శకులు, నిర్మాతలు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారంటూ, అందులో తానూ ఉన్నానంటూ సంచలన విషయాలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ సినీ స్టార్లపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. తాజాగా శ్రీరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రిక్వెస్ట్ చేస్తూ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ చర్చనీయాంశం అయింది.
గౌరవనీయులైన సీఎం కేసీఆర్ సర్. ఇప్పటికైనా స్పందించండి. ఎన్నిరోజులు మేము ఈ బాధలు పడాలి. డ్రగ్స్ అలవాటు, హీరోయిన్స్‌తో పడుకునే వారిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు' అని శ్రీరెడ్డి తెలిపారు.
పొలిటికల్ తేనెతుట్టెను నేను టచ్ చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే వారి గురించి మాట్లాడటం ద్వారా నాకు న్యాయం జరుగదని తెలుసు. ఒక వేళ మాట్లాడితే నన్ను చంపేస్తారు. అందుకే వారి జోలికి పోదలుచుకోలేదు. అలాంటి వారిలో మీకు సన్నిహితులైన వారు కూడా ఉన్నారు సార్. అందుకే నేను ఆ పొలికల్ సైడ్ రావాలనుకోవడం లేదు, నోరు మూసుకుని ఉంటాను'