India faced an embarrassing defeat in the second ODI against England at Lord’s, London. India were all out for 236 chasing 323 as they lost by 86 runs allowing the host to level series.
#cricket
#msdhoni
#england
#teamindia
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ట్విటర్‌లో ఫ్యాన్స్ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో శనివారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో 59 బంతులాడిన ధోనీ పేలవంగా రెండు ఫోర్లు మాత్రమే కొట్టి 37 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో.. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 236 పరుగులకే కుప్పకూలిపోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి పరుగుల కోసం తీవ్రంగా శ్రమించిన ధోనీ.. ఎక్కువగా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు.దీంతో.. క్రమంగా బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. మ్యాచ్‌లో ధోనీ కంటే చాహల్ (12: 12 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్‌తో మెరుగ్గా ఆడాడని ఫ్యాన్స్ చురకలు అంటిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు జో రూట్ (113: 116 బంతుల్లో 8ఫోర్లు, ఒక సిక్సు) సెంచరీ బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో రెండో వన్డేలో భారత్ భంగపడింది.