సంచలన నటి శ్రీరెడ్డి తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అలజడి రేపే ప్రయత్నాలు చేస్తోంది. రాఘవ లారెన్స్, శ్రీకాంత్ ఇలా వరుసగా తమిళ హీరోల గురించి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలన పోస్టులు పెడుతోంది. తాను కోలీవుడ్ లో చీకటి కోణాల్ని వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొంది. దీనివెనుక శ్రీరెడ్డి ఉద్దేశం ఏమిటో తెలియాల్సి ఉంది.
కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి చేసిన పోరాటం టాలీవుడ్ లో అలజడి సృష్టించింది. చాలా కాలం పాటు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లారెన్స్, శ్రీకాంత్ వంటి తమిళ హీరోల పేర్లు బయట పెట్టింది. ఇంకెవరి పేర్లు బయటకు తీస్తుందో అనే చర్చ జరుగుతోంది.
తమిళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలని బయట పెట్టాలని భావిస్తున్నా. కానీ నటుడు విశాల్ నుంచి నాకు ముప్పు పొంచి ఉంది అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. తనని రాఘవ లారెన్స్ హోటల్ రూమ్ కు తీసుకుని వెళ్లాడని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.