Describing fugitive baron Vijay Mallya as 'smart', Union minister Jual Oram on Friday advised scheduled castes and tribes to become smart enough to avail bank loans to become successful entrepreneurs.
#VijayMallya
బ్యాంకులకు సుమారు రూ.9వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయి తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ప్రశంసలు కురిపించి ఇరుకునపడ్డారు కేంద్రమంత్రి జ్యూయల్ ఓరమ్. విజయ్ మాల్యా చాలా చురుకై(స్మార్ట్)న వ్యక్తి అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు తావిచ్చాయి. జాతీయ గిరిజన ప్రారిశ్రామికవేత్తల సదస్సు 2018లో కేంద్రమంత్రి ఓరమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. వారికి విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించారు. గిరిజనులు చురుకుగా మారి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదిగి బ్యాంకు రుణాలు పొందేందుకు అర్హులుగా మారాలి' అని పిలుపునిచ్చారు.