వాడరేవు పోర్టు నిర్మాణం పై బాబుకు గడ్కరీ లేఖ

2018-07-14 627

Union Minister Nitin Gadkari responded on DCI and Vadaravu development issues.

ప్రకాశం జిల్లా వాడరేవుకు 3వేల ఎకరాలు కేటాయిస్తే పోర్టు నిర్మాణానికి తాము సిద్ధమని కేంద్ర షిప్పంగ్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ప్రతిపాదనలు అందిస్తామని తెలిపారు.విశాఖ పోర్టుకి కొత్తగా భూమి లభించే అవకాశం లేనందున ఈ పోర్టుపై ఒత్తిడి తగ్గాలంటే కొత్త పోర్టు అవసరమని ఆయన చెప్పారు. విశాఖలో రెండు రోజుల పాటు దేశంలోని మేజర్ పోర్టుల పనితీరు, ఈ ఏడాది అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణలపై ఆయన సహాయ మంత్రులతో కలిసి శుక్రవారం సమీక్షించారు. సమీక్ష వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
#vadarevu
#nitingadkari
#centralgovernment
#chandrababunaidu