మీ ఆవేదన తెలుసు కానీ : అమిత్ షా

2018-07-14 660

BJP chief Amit Shah on Friday met ace badminton player Saina Nehwal and Ramoji Rao in Hyderabad as part of the party's sampark se samarthan campaign.

సంపర్క్ ఫర్ సమర్థన్‌లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఈనాడు అధినేత రామోజీ రావులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత నాలుగేళ్లుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి వివరించారు. భేటీ సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు ఉన్నారు.
నగరానికి వచ్చిన అమిత్ షా అంతకుముందు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిటీతో సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి ఫిల్మ్ సిటీకి వెళ్లారు. సైనా నెహ్వాల్‌ను ఆమె ఇంట్లో కలిశారు. బీజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పుస్తకాన్ని అందించారు. సైనా మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా బీజేపీ దేశాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తోందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.
#ramojirao
#ramojifilmcity
#sainanehwal
#telangana
#amitshah
#samparkforsamarthan