ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిస్తే ఏం జరుగుతుంది??

2018-07-14 85

Now, according to Hindu beliefs, ashada masam is the inauspicious month, as all the holy works like marriage, entering into a new house (gruhapravesh), wearing sacred thread (upanayanam), etc. are not allowed.
#monsoon
#faith
#spirituality
#AshadaMasam
#Marriage

శూన్యమాసం అని అంటారు. శూన్యమాసం అంటే శుభకార్యాలకు అనుకూలం కాని మాసం అని అర్ధం. వర్ష ఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది.ఈ నెలలో చేసే స్నానం,దానం, జప,పారాయణలకు మొదలగు పనులకు విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది.
ఆషాఢ మాసంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ఎంతో ముక్తి దాయకాలు.
ఆషాఢమాసంలోనే దక్షిణాయణ కాలం ప్రారంభమవుతుంది.కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది.అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అని అంటారు.
ఈ అయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశగా ప్రయాణం చేస్తాడు.దక్షిణాయనం పితృ దేవతలకు ప్రీతి కరమని శాస్త్రంలో చెప్పబడింది.