Virat Kohli is Well On The Way Becoming One The Greatest ODI Captains

2018-07-14 326

India defeated England by eight wickets in the first One-Day International (ODI) at Trent Bridge in Nottingham on Thursday. The win was Virat Kohli's 39th as captain of India's ODI team. The 29-year-old is now tied with West Indian great Clive Lloyd and Australian legend Ricky Ponting with 39 victories after their first 50 ODIs as captains.
#viratkohli
#teamindia
#cricket
#england
#indiainengland2018


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ కెప్టెన్‌గా కోహ్లీకి 50వది.ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 50 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ 39వ విజయాన్ని అందుకోగా... 11 అపజయాలను నమోదు చేసుకున్నాడు. దీంతో మొదటి 50 వన్డేలకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించి ఎక్కువ విజయాలు నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ చోటు దక్కించుకున్నాడు.ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొలి వన్డే విజయంతో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ల సరసన కోహ్లీ చేరాడు. మొదటి 50 వన్డేల్లో పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో ఓడిపోగా... కోహ్లీ(10 మ్యాచ్‌లు), లాయిడ్(11) మ్యాచ్‌ల్లో ఆయా జట్లు ఓడిపోయాయి.