Tammareddy Bharadwaj Talks About Tollywood Issue

2018-07-13 835

యూఎస్ఏ టాలీవుడ్ సెక్స్ రాకెట్ బట్టబయలైన తర్వాత 'సినీ ఇండస్ట్రీని నిందిస్తుండటం... ఇలాంటివి చోటు చేసుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు సిగ్గు చేటు' అంటూ వస్తున్న కామెంట్లపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్ అయ్యారు. సిగ్గు పడాల్సింది ఇండస్ట్రీ కాదు, వ్యభిచారం చేసిన వారు..... ఇక్కడి వారిని అక్కడికి పిలిపించి మభ్యపెట్టి, బెదిరించి, బలవంతపెట్టి ఇలాంటి నీచమైన పనులు చేయిస్తున్నవారే సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక్కడ ఎవరు సినిమా వాళ్లు? ఎవరు కాదు? అనేదే అసలు సమస్య. సినిమా వాళ్లు అంటే అర్థం ఏమిటి? ఉదాహరణకు నేను నటున్ని అంటే మీరు నమ్ముతారా? భరద్వాజగా నేను మీకు తెలుసు, భరద్వాజగానే మాట్లాడతాను. నేను నటుడిని, మా అసోసియేషన్ ఉంది అంటే కుదరదు. ఒకటి రెండు సినిమాల్లో నేను వేషాలు వేసి ఉండొచ్చు. వేషం వేసిన ప్రతి వాడు నటుడు అయిపోడు, నటులు ఏదైనా నేరాల్లో ఇరుక్కుంటే సినిమా ఇండస్ట్రీకి ఆపాదించడం సరైంది కాదు... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.