Kuldeep Yadav has taken 18 wickets in five games on the tour to UK with six wickets coming on Thursday in the first ODI against England. His sensational spell, fourth-best for India in the 50-over format. He’s enjoying plenty of purchase from the pitches in England with warm and hot conditions helping the wrist spinner further.
#kuldeepyadav
#viratkohli
#indiainengland2018
#yuzvendrachahal
కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. మూడు టీ20ల సిరిస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. గురువారం నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.భారత విజయంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ 6 వికెట్లు తీసి 25 పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు నానా ఇబ్బందులు పడ్డారు.తొలి టీ20లో కుల్దీప్‌కు ఐదు వికెట్లు సమర్పించుకున్న ఇంగ్లాండ్ జట్టు.. గురువారం రాత్రి జరిగిన తొలి వన్డేలో ఏకంగా ఆరు వికెట్లు సమర్పించుకుంది. ఇదే తడబాటు శనివారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే రెండో వన్డేలో కూడా కొనసాగితే వన్డే సిరిస్‌ను కూడా చేజార్చుకోకతప్పదు.