Chinna Babu Movie Public Talk చిన్నబాబు సినిమా పబ్లిక్ టాక్

2018-07-13 721

After the stupendous success of Khaki, Karthi is back with Chinna Babu. The much-awaited village drama has been steered by Pasanga and Marina fame, Pandiraj. With much expectations being pinned on the movie, one needs to see if Chinna Babu would provide the desired and deserved success to the associated folks. Chinnababu is a story based on a big joint family of Satyaraj and their extended relatives. While first half is decent , second half is stuffed with heavy dose of sentiment scenes.
#ChinnaBabu

ఖాకీ' లాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మూవీ తర్వాత కార్తి హీరోగా తెరకెక్కిన 'కడైకుట్టి సింగం' అనే తమిళ సినిమా తెలుగులో 'చినబాబు'గా విడుదలైంది. చాలా కాలం తర్వాత కార్తి విలేజ్ డ్రామాతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్టెనర్ మూవీలో నటించారు. దేశానికి అన్నం పెట్టే రైతు పాత్రలో తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రయోగాలకు పోకుండా అందరికీ తెలిసిన విలేజ్, ఫ్యామిలీ డ్రామాతో దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్వయంగా కార్తి సోదరుడు సూర్య నిర్మించడం మరో విశేషం. సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరించే అవకాశం ఉంది అనేది రివ్యూలో చూద్దాం...
కృష్ణం రాజు (కార్తి) వ్యవసాయాన్ని ప్రేమించే ఒక రైతు. డాక్టర్, లాయర్, కలెక్టర్, ఇంజనీర్ అని అంతా ఎలా గొప్పగా చెప్పుకుంటారో.... తాను రైతును అని గర్వంగా చెప్పుకునే వ్యక్తి. చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారికి తానేమీ తక్కువ కాదు అని నిరూపించుకుంటాడు. అదే ఊర్లో రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న సురేంద్ర రాజును హత్యకేసులో కృష్ణం రాజు జైలుకు పంపిస్తాడు. అదే సమయంలో తన మరదలుతో కృష్ణం రాజు ప్రేమలో పడటాన్ని సహించలేక అతడిని అంతం చేయాలని ప్లాన్ చేస్తాడు... అందులో ఫెయిల్ అవ్వడంతో కుటుంబంలో చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తాడు.