కృష్ణంరాజు నోట చంద్రబాబు మాట

2018-07-13 1,284

BJP leader Krishna Raju has praised CM Chandrababu effort for state devolopment.

ఇటీవలే సిఎం చంద్రబాబుపై మండిపడ్డ సినీ నటుడు, కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని కృష్ణంరాజు కితాబునిచ్చారు. గురువారం ఒక టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. అయితే జగన్,పవన్ లకు బీజేపీ స్క్రిప్ట్‌ ఇస్తోందన్న ఆరోపణలను కృష్ణంరాజు ఖండించారు. ఉత్తరాంధ్రలో ఎక్కడా బీజేపీపై నెగిటివ్ అభిప్రాయం లేదని కృష్ణంరాజు అన్నారు. పాటలు, స్కిట్స్ ద్వారా ప్రజలకు అసలు నిజాలు తెలియజేయనున్నట్లు కృష్ణంరాజు వెల్లడించారు.

#andhrapradesh
#visakhapatnam
#bjp
#krishnamraju
#jagan
#tdp