Oneindia Telugu News Update వన్ ఇండియా తెలుగు న్యూస్

2018-07-13 13

The axis of monsoon trough continues to pass through Sri Ganganagar, Alwar, Nowgong, Sidhi, Ambikapur, Chaibasa, Digha and then east¬southeastwards to East central Bay of Bengal.
#monsoon

1.పవన్‌ కల్యాణ్‌కు కంటి శస్త్రచికిత్స:విశ్రాంతి సూచించిన వైద్యులు
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కంటికి గురువారం శస్త్రచికిత్స జరిగింది. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ఈ సర్జరీ నిర్వహించారు.
కొన్ని నెలల క్రిందట ఆయన ఎడమ కంటిపై కురుపు ఏర్పడింది. అయినప్పటికీ పవన్ అలాగే ప్రజా పోరాటయాత్రలో పాల్గొంటున్నారు. అయితే కంటి మీద కాంతి, ధూళి పడకుండా నల్లని కళ్లద్దాలు వాడుతున్నారు. ఈనేపథ్యంలో కంటి నొప్పి అధికం కావడంతో పవన్‌ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఈ కురుపును పరిశీలించిన వైద్యులు గురువారం శస్త్రచికిత్స చేసి కురుపును తొలగించారు.
సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తవడంతో పవన్ ను గురువారం సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. అయితే నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించినట్లు సమాచారం.
2.తాడిపత్రి స్టీల్‌ప్లాంట్‌‌లో గ్యాస్ లీక్: ఆరుగురు మృతి, మరో ఐదుగురికి తీవ్ర అస్వస్థత
జిల్లాలోని తాడిపత్రి స్టీల్ ప్లాంట్‌(గెరుడౌ)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్(విష వాయువులు) లీకవడంతో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఆరుగురు మృతి చెందడంతో వారి బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
3.తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటికే మూడు టీ20ల సిరిస్‌ను గెలుచుకున్న టీమిండియా వన్డే సిరిస్‌లోనూ బోణీ కొట్టింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్లతో ఘన విజయం సాధించింది.
269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(40), రోహిత్‌ శర్మ(137 నాటౌట్‌) తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం అందించారు.

Videos similaires