Akhil Akkineni Gives Clarity On Venky Atluri Issue

2018-07-13 1,159

Akhil Akkineni third movie started with Venky Atluri. This shooting has begun at London. In situation, a news was that, there is differences between Akhil and Venky. In this occassion, both were respond with a video about their differences


సినిమా పరిశ్రమలో నిప్పు లేకుండా పొగపుట్టడం చాలా సహజమైన విషయం. ఒకవేళ అలాంటి వార్తలపై వివరణ ఇవ్వకపోతే దానిని గోరంతలు కొండంతలు చేస్తారు. మసిపూసి మారెడు కాయను ఏదో చేసేస్తారనే విధంగా కథనాలు వెలువడుతాయి. తాజాగా టాలీవుడ్‌లో దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో అఖిల్ మధ్య విభేదాలు అంటూ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేసింది. అందుకు సమాధానంగా వారిద్దరు కలిసి ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు.
తొలిప్రేమ తర్వాత అఖిల్‌తో వెంకీ అట్లూరి జతకట్టారు. తన మూడో చిత్రానికి సంబంధించిన స్క్రిప్టులో వెంకీ చేస్తున్న మార్పులు అఖిల్‌కు న‌చ్చ‌డంలేద‌ని, అందుకే అఖిల్ రెండ్రోజులు షూటింగ్‌కు రాలేద‌ని వార్తలు షికారు చేశాయి. ఈ ఇద్ద‌రి మ‌ధ్య క్రియేటివ్ క్లాషెస్ కార‌ణంగా సినిమా ఆగిపోయే ప్ర‌మాదంలో ప‌డింద‌నేది ఆ వార్తల సారాంశం.
#AkhilAkkineni