తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ కాలేజీలో ఘోరం జరిగింది. మాక్ డ్రిల్ కారణంగా ఓ విద్యార్థిని ప్రాణం పోయింది. జిల్లాలోని నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు.