Captain Virat Kohli is all set to join West Indian great Clive Lloyd and Australian former captain Rickey Ponting in an elite list of captains. Kohli, who is leading India for the 50th ODI as captain has 38 wins to his name, which makes him the joint-most successful ODI captain in the history of cricket.
#viratkohli
#india
#england
#msdhoni
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జి వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ దూరం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ సిద్దార్థ్ కౌల్ అరంగేట్రం చేశాడు.
మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా వన్డే క్యాప్‌ని అందుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2015 అక్టోబర్ తర్వాత రైనా ఆడుతున్న తొలి వన్డే ఇదే కావడం గమనార్హం.ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 50 వన్డే. 50 వన్డేల్లో కెప్టెన్‌గా టీమిండియాకు నాయకత్వం వహించిన ఏడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకూ ధోనీ, అజహర్, గంగూలీ, ద్రావిడ్, కపిల్, సచిన్ టెండుల్కర్ మాత్రమే 50కి పైగా వన్డేల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు.