An injured Alex Hales has been ruled out of the first ODI of England's series against India.Hales, who was already fighting for a place in the team with a fit-again Ben Stokes, has reportedly injured his side and will be out of the Trent Bridge ODI.
భారత్‌తో తొలి వన్డే ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అలెక్స్ హేల్స్ గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య మరికొద్దిసేపట్లో తొలి వన్డే ప్రారంభంకానుంది. పర్యాటక భారత జట్టు ఇప్పటికే ఇంగ్లిష్ గడ్డపై టీ20 సిరీస్ గెలుచుకొంది. అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతోంది.మరో పక్క సొంతగడ్డపై టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్ ఎలాగైనా వన్డే సిరీస్‌ను దక్కించుకోవాలని కసిగా ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో హేల్స్ పాల్గొనలేదు. గాయం కారణంగా అతడు ప్రాక్టీస్‌కు హాజరుకాలేదని, భారత్‌తో జరిగే తొలి వన్డేకు దూరం కానున్నాడని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు ఇది గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఎందుకంటే గురువారం భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలోనే హేల్స్ గత నెల ఆస్ట్రేలియాపై 147 పరుగులు సాధించాడు.
#alexhales
#cricket
#teamindia
#england
#viratkohli