Tollywood is welcoming another hero from Mega family. Mega star Chiranjeevi son in law Kalyan Dhev is introducing with Vijetha movie. This movie deals with the journey of a man who’s aimless and carefree about life. The story explores the relationship between a father and his son. Vijetha set to release on July 12th. In ocassion, Kalyan speaks to media about the movie.
విజేత సినిమా పేరు గుర్తుకు రాగానే మెగాస్టార్ చిరంజీవిని నటుడిగా ఆకాశానికి ఎత్తిన చిత్రం గుర్తుకు వస్తుంది. అలాంటి ప్రజాదరణ పొందిన టైటిల్‌తో సినిమా వస్తుందంటే ప్రత్యేకమైన అటెన్షన్ తప్పక ఉంటుంది. అదికాకుండా మెగా ఫ్యామిలీ నుంచి అలాంటి టైటిల్‌తో వస్తున్నారంటే ఇంకా స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ విజేత టైటిల్‌తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. తన మొదటి చిత్రానికి తండ్రి, కొడుకుల మధ్య నడిచే భావోద్వేగాన్ని కథగా మలిచుకొన్నాడు. అలాగే తొలిచిత్ర దర్శకుడు రాకేశ్ శశిని తనతోపాటు టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. తమ తొలిచిత్రాలతో హీరో, దర్శకులు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకొన్నారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
రామ్ (కల్యాణ్ దేవ్) ఇంజినీరింగ్ పూర్తి చేసి బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. తండ్రి శ్రీనివాసరావు ఓ కంపెనీలో మామూలు ఉద్యోగి. కొడుకు స్థిరపడితే చూడాలనే ఆందోళనతో ఉంటాడు. ఓ సందర్భంలో ఆకట్టుకొని, ఎదురింట్లోకి అద్దెకు వచ్చిన జైత్ర (మాళవిక నాయర్) ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో తనకు నచ్చిన పని చేయాలనే ఉద్దేశంతో లోకల్ బాయ్స్.. సర్ఫ్‌రైజ్ ప్లానర్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని ప్రారంభిస్తాడు. రామ్ చేసిన ఓ పని కారణంగా తండ్రికి గుండెపోటు వస్తుంది. చెల్లెలి పెళ్లి కోసం భారీ కట్నం ఇవ్వాల్సిన సమస్య ఎదురవుతుంది. ఇదిలా ఉండగా, కుటుంబం కోసం తన తండ్రి తనకిష్టమైన వృత్తిని ఎంచుకోకుండా మాములు ఉద్యోగి మారుతాడనే విషయాన్ని రామ్ తెలుసుకొంటాడు.