Sara Tendulkar Photos Goes Viral

2018-07-12 514

ఐపీఎల్ కంటే ముందునుంచే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గారాల పట్టి జీవా ధోనీ నెట్టింట్లో హల్‌చల్ చేస్తూనే ఉంది. క్రికెటర్ల కూతుళ్లలో ఆమెకు ఉన్నంత ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదనిపిస్తోంది. కానీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా తానేమీ తీసిపోనంటూ సోషల్ మీడియా ద్వారా బాలీవుడ్ తారలకు ధీటుగా పోటీనిస్తోంది. క్యూట్ స్మైల్‌తో ట్రెండీ లుక్‌తో.. సింపుల్ స్టైల్‌తో ఫొటోలు పెడుతూ.. అందరినీ ఆకట్టుకుంటోంది.తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ స్మైలింగ్ ఫోటో ఇప్పుడు అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. టీ కప్పు పట్టుకుని ఓ స్మైలింగ్ లుక్ ఇచ్చిన సారా ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. సాధారణ అమ్మాయిలా తన టీనేజ్ భావాలను ఆ ఫోటోలో సారా వ్యక్త పరిచినా.. సచిన్ అభిమానులు మాత్రం ఆమెను ఓ సెలబ్రిటీలాగా చూస్తున్నారు. ఆ ఫోటోకు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు.