పోలవరం అంచనాలు భారీగా పెంచారు: నితిన్ గడ్కరీ, చంద్రబాబు వివరణ.

2018-07-12 7

Gadkari visited the Polavaram dam site today to review the work. The visit is under a spotlight as it was the first visit by any central minister after the BJP and the TDP severed ties. Andhra Pradesh CM Chandrababu Naidu also accompanied Gadkari during his visit.

2019 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. బుధవారం సాయంత్రం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోపాటు ఆయన పోలవరం సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్రమంత్రికి చంద్రబాబు వివరించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనులన్నీ పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఏప్రిల్ కల్లా అన్ని మెజార్టీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 2019, డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. డీపీఆర్2ను కూడా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరామని చెప్పారు.
ప్రాజెక్టు భూసేకరణ కోసం 33వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 57,940కోట్లు అవసరమవుతుందని చెప్పారు. 2013 చట్టం ప్రకారం అంచనాలు పెరిగాయని తెలిపారు.
అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పోలవరం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు దేశానికే కీలక ప్రాజెక్టు అని అన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. మరింత వేగం పెంచాలని కోరారు.

Videos similaires