రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న '2.0' మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 29, 2018న విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు శంకర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఇంతకాలం సినిమా విడుదల ఆలస్యం కావడానికి గల కారణాలు కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మరో వైపు ఈ చిత్రంలో విలన్ పాత్ర చేస్తున్న అక్షయ్ కుమార్ కూడా మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.
గతేడాది విడుదల కావాల్సిన ‘2.0' చిత్రం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక పోవడం వల్లనే వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వర్క్ ఓ కొలిక్కిరావడంతో ‘నవంబర్ 29'న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
ఎట్టకేలకు విఎఫ్ఎక్స్ కంపెనీలు విఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ విషయంలో ప్రామిస్ చేశారు. వారు నమ్మకంగా చెప్పారు కాబట్టి సినిమాను నవంబర్ 29న విడుదల చేయబోతున్నాం' అంటూ శంకర్ ట్వీట్ చేశారు.
Rajinikanth's 2.0 will open in theatres on November 29 this year, director Shankar Shanmugham confirmed in a tweet. "Hi everyone, at last the VFX companies promised the final delivery date of the VFX shots. The movie will release on November 29, 2018."
#Rajinikanth's2.0
#VFX