France 1 Belgium 0: Umtiti Heads Les Bleus Into World Cup Final

2018-07-11 1

రష్యా వేదికగా సంచలన విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చిన బెల్జియం ఆశలకు గండి పడి.. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ అడుగుపెట్టింది. బెల్జియంతో మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియంను 1-0 తేడాతో మట్టికరిపించింది. దీంతో ఫ్రాన్స్ రెండోసారి ప్రపంచ కప్‌ని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో బెల్జియం జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది.
గత 24 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బెల్జియానికి ఓటమే లేదు. మరోవైపు ఫ్రాన్స్‌ కూడా ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనని కొనసాగిస్తుండటంతో.. మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే తొలి మూడు నిమిషాలు బంతిని ఆధీనంలో ఉంచుకుని బెల్జియం డిఫెండర్లకు చుక్కలు చూపెట్టాడు. వెంటనే బంతిని అందిపుచ్చుకున్న బెల్జియం ఆ తర్వాత అటాకింగ్ గేమ్ మొదలుపెట్టింది.

Samuel Umtiti was the unlikely hero as France reached the World Cup final for the third time in 20 years courtesy of a 1-0 win over Belgium in St Petersburg on Tuesday (July 10).
#france
#belgium
#worldcup2018
#footballworldcup
#fifaworldcup2018
#football