Sreesanth New Look Goes Viral In Facebook

2018-07-10 800

టీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నా అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ తర్వాత జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న ఈ కేరళ పేస్‌బౌలర్.. ప్రస్తుతం కండలు పెంచే పనిలో ఉన్నాడు. అతని కొత్త లుక్ చూసి తనని ఫాలో అవుతున్న సోషల్ మీడియా వినియోగదారులు షాక్‌కు గురైయ్యారు. ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో తన కొత్త లుక్‌ను అభిమానులకు పరిచయం చేశాడు.
జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశాడు. దీనికితోడు పొడువాటి జుట్టు.. గడ్డంతో టోటల్‌గా డిఫరెంట్ లుక్‌లో శ్రీశాంత్ కనిపిస్తున్నాడు. కండల వీరుడిగా అతని గెటప్ చూసి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కొందరైతే గతంలో హర్భజన్‌తో అతనికి జరగిన గొడవను ప్రస్తావిస్తూ.. భజ్జీకి జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. ఇప్పటికైనా శ్రీశాంత్‌తో కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Sreesanth was a very famous and a super talented cricketer in the Indian team. After a series of unfortunate incidents, where he was accused of participating in spot-fixing, he was banned from playing for the team.
#Sreesanth