మరోసారి నోరు జారిన నారా లోకేష్

2018-07-10 1,481

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని మంత్రి నారా లోకేష్ మంగళవారం సవాల్ చేశారు. ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీ, ప్రత్యేక ఉత్తరాంధ్ర పేరుతో పవన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
కర్నూలు జిల్లాలో సోమవారం పర్యటించిన లోకేష్ బ్రాహ్మణకొట్కూరులో మాట్లాడారు. ఆనాడు ఫుల్ మెజార్టీ ఉన్నా అన్నగారిని (ఎన్టీఆర్) దింపితే (అధికారం నుంచి) తెలుగు ప్రజలు గర్చించారని చెప్పారు. ఆ గర్జనను తట్టుకోలేక మళ్లీ మన అన్నగారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరా గాంధీదేనని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఆ గర్జనను తట్టుకోలేక ఇందిరాగాంధీ తలొగ్గిందనే వ్యాఖ్యలు చేయబోయి, ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరాగాంధీదే అని వ్యాఖ్యానించినట్లుగా కనిపిస్తోంది. దీనిని పట్టేసిన వారు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. గతంలో వర్ధంతిని జయంతి, అవినీతిలో ఏపీ ముందు వరుసలో ఉందని పొరపాటుగా వ్యాఖ్యానించారు.
మంత్రి నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయనున్నారు.

Andhra Pradesh Minister and TDP leader Nara Lokesh lashes out at Jana Sena chief Pawan Kalyan, demand to prove.
#TDP
#NaraLokesh

Videos similaires