పవన్ కళ్యాణ్ పై జలీల్ ఖాన్ మండిపాటు

2018-07-10 1,252

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మంత్రి నారా లోకేష్ పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బోడె ప్రసాద్ మంగళవారం కౌంటర్ ఇచ్చారు. పవన్, కన్నాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కన్నా లక్ష్మీనారాయణ ర్యాలీల్లో సంఘ విద్రోహ శక్తులు పాల్గొంటున్నాయని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై కన్నా తన పరిమితికి మించి మాట్లాడుతున్నారన్నారు.
చంద్రబాబు అవినీతిని నిరూపించగలరా అని కన్నాకు బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. తాము కన్నా లక్ష్మీనారాయణ అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఏమాత్రం ఆదరించరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి రాజ్యసభ ద్వారానే మంత్రి అయిన విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరిచిపోయారా అని ప్రశ్నించారు. లోకేష్ పైన పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే చదువుతున్నారన్నారు.

Telugudesam party leaders target Jana Sena chief Pawan Kalyan for his comments on Minister Nara Lokesh.
#Telugudesamparty
#PawanKalyan