Cricketer Harmanpreet Kaur Loses DSP Rank Over Fake Degree

2018-07-10 300

నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్‌ సమర్పించిన భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. డీఎస్పీ హోదాని తొలగిస్తూ పంజాబ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత శతకంతో భారత్‌కు ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఆమె ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యారు.సమర్పించిన సర్టిఫికేట్స్‌ నకిలీవని: దీంతో పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీ జాబ్‌ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు చేపట్టారు. కానీ.. ఆ సమయంలో సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్స్‌ నకిలీవని తాజాగా పంజాబ్‌ పోలీసులు తేల్చారు.

The Punjab government has withdrawn the deputy superintendent of police (DSP) rank from Harmanpreet Kaur after the graduation degree of India women’s T20 team captain was found to be fake.
#indian
#women
#cricket
#harmanpreethkaur
#t20