Jagapathi Babu Talks About His Character In Sakshyam Movie

2018-07-10 3,046

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'సాక్ష్యం' . అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మాత‌గా.. శ్రీవాస్ ద‌ర్శ‌త‌క్వంలో ఈ మూవీ తెరకెక్కించారు. ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ ఎంటర్టెనర్‌‌గా తీసిన చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందించారు. ఆడియో ఆవిష్క‌ర‌ణ ఇటీవల హైద‌రాబాద్‌లో జ‌రిగింది. జులై 27న సినిమాను విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తాను పోషించిన విలన్ పాత్ర గురించి జగపతి బాబు మాట్లాడుతూ 'తన పాత్ర అత్యంత కిరాతకంగా, నీచంగా ఉంటుంది' అన్నారు.
నేను ఇప్పటి వరకు లెజెండ్, నాన్నకు ప్రేమతో, జయ జానకి నాయక చిత్రాల్లో చెప్పుకోదగిన విలన్ పాత్రలు చేశాను. ఆ విలన్ పాత్రలకు మించి పోయేలా, భయంకరంగా ‘సాక్ష్యం'లో విలన్ పాత్ర ఉంటుంది అని జగపతి బాబు తెలిపారు.
తెరపై నేను పోషించిన విలన్ పాత్ర చూసిన ప్రేక్షకుడు ఇంతకన్నా నీచుడు వుండడు అనే భావనకు వస్తారని తెలిపారు. అలాంటి విలన్ గా నేను ఈ సినిమాలో కనిపిస్తాను... అని జగపతి వెల్లడించారు.

Jagapathi Babu play a Villain role in Sakshyam, Starring Bellamkonda Srinivas & Pooja Hegde, Music composed by #Harshavardhan Rameswar, Directed by Sriwaasand Produced by Abhishek Nama under Abhishek Pictures.
#JagapathiBabu