ప్రేమెంత ప‌ని చేసె నారాయ‌ణ‌ ఆడియో రిలీజ్ ఈవెంట్

2018-07-09 1

జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస రావు ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ నిర్మిస్తున్న చిత్రం ప్రేమెంత ప‌ని చేసె నారాయ‌ణ‌. ఈ చిత్ర ఆడియో ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది. ఇక ఈ చిత్రంలోని సాంగ్ విజువ‌ల్స్ ను సినీ , రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆవిష్క‌రించారు. అట్టా సూడ‌మాకు... సాంగ్ విజువ‌ల్ ను జ‌య‌ప్ర‌ద, ప్ర‌ముఖ పొలిటీషియ‌న్ అమ‌ర్‌సింగ్ ఆవిష్క‌రించ‌గా, ఈ బుజ్జిగాడికి నచ్చేశావే... పాట‌ను ద‌ర్శ‌కుడు క్రిష్‌, హ‌రిలో రంగ హ‌రి... విజువ‌ల్ సాంగ్ ను మాస్ మ‌హారాజ రవితే జ ఆవిష్క‌రించి... హ‌రికృష్ణ‌లో మంచి డాన్స‌ర్ తో పాటు, అద్భ‌తుమైన యాక్ట‌ర్ ఉన్నాడంటూ ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ...ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్ గారి చేతుల మీదుగా విడుద‌లైన ఆడియో సాంగ్స్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. అలాగే వీడియో సాంగ్స్ ప్ర‌ముఖుల చేతుల మీదుగా ఆవిష్క‌రించాం. అట్ట చూడ‌మాకు...పాట‌ను ఆవిష్క‌రించిన జ‌య‌ప్ర‌ద‌గారు . హ‌రి టెర్రిఫిక్ డాన్స్ చేయ‌డంతో పాటు, త‌న‌లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయంటూ ప్ర‌శంసించారు.

YSRCP Chief YS Jagan Mohan Reddy has launched the song of Prementha Panichese Narayana. It is an upcoming Telugu film featuring Harikrishna Jonnalagadda, Akshitha in the lead roles. Anchor Jhansi will be seen in an important role. Directed by Jonnalagadda Srinivasa Rao and produced by Savitri Jonnalagadda, the music of the movie is composed by Yajamanya. Actress Jayaprada, Politician Amar Singh appreciated this film unit.