కత్తి మహేష్ పై సిటీ డీజీపీ వ్యాఖ్యలు

2018-07-09 9


తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. కానీ కత్తి మహేష్ వంటి వారు సమాజంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు ఏమాత్రం సరికాదన్నారు.
ఆరు నెలల పాటు మహేష్ కత్తిని నగరం నుంచి బహిష్కరించామని చెప్పారు. ఓ టీవీ ఛానల్ పదేపదే ఇందుకు సంబంధించిన చర్చలు పెట్టడం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. టీవీ ఛానల్‌ను వేదికగా చేసుకొని మహేష్ కత్తి మళ్లీ మళ్లీ భావవ్యక్తీకరణ పేరుతో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయన తన వ్యాఖ్యలతో మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు.
ఈ కారణంగా సమాజంలో శాంతిభద్రత భంగానికి దారి తీస్తున్నాయని డీజీపీ చెప్పారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా అభిప్రాయాలు వ్యక్తీకరించాలన్నారు. మహేష్ కత్తి అనుమతి లేకుండా నగరంలోకి వస్తే అరెస్టు చేసి, క్రిమినల్ కేసు పెట్టి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. అతనిని చిత్తూరు జిల్లాలోని స్వస్థలం తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

Videos similaires