వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కలిశారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో ఆయనను పలువురు ప్రముఖులు కలుస్తున్నారు.
ఇటీవల పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్ తదితరులు కలిశారు. ఇప్పుడు చోటా కే నాయుడు కలిశారు. సోమవారం మండపేట నియోజకవర్గంలో జరుగుతున్న యాత్రలో జగన్‌తో కలిసి కాసేపు నడిచారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చోటా కే నాయుడు మాట్లాడుతూ సుపరిపాలన కావాలంటే జగన్ సీఎం కావాలన్నారు.
Cinematographer Chota K Naidu met YSR Congress Party chief YS Jagan Mohan Reddy in Praja Sanklpa Yatra in East Godavari district.
#prajasankalpayatra
#ysjagan
#chotaknaidu
#andhrapradesh