South Africa Cricketers Dane van Niekerk and Marizanne Kapp tie the knot

2018-07-09 256

దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టు అగ్రశ్రేణి క్రీడాకారిణిలిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జట్టు కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మరిజాన్‌ కాప్‌ శనివారం పెళ్లి చేసుకున్నారు. సఫారీ దేశంలో ఇద్దరు మహిళల వివాహంపై ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. 2009 వరల్డ్‌ కప్‌ టోర్నీలో వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. 2017-18 సంవత్సరానికి దక్షిణాఫ్రికా అత్యుత్తమ క్రికెటర్‌ అవార్డు అందుకున్న నికెర్క్, ఇప్పుడు ఆ దేశం తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతోంది.కాప్‌ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. వీరిద్దరు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా టాప్‌-10లో ఉన్నారు. బిగ్‌బాష్‌ లీగ్‌లో కూడా సిడ్నీ సిక్సర్స్‌ తరఫున కలిసి ఆడిన నికెర్క్, కాప్‌... దక్షిణాఫ్రికాలో బాలుర అకాడమీలో శిక్షణ పొందిన తొలి ఇద్దరు అమ్మాయిలుగా కూడా గుర్తింపు పొందారు. ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఇది రెండోసారి. గత ఏడాది న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌ను సహచరి లియా తహుహు కలిసి వివాహం చేసుకున్నారు.

South Africa women's cricket team captain Dane van Niekerk married fast-bowling all-rounder Marizanne Kapp on Saturday. After New Zealand's Amy Satterthwaite and Lea Tahuhu, they are the second set of current international teammates to get married, reports ESPNCricinfo.
#southafrica
#newzealand
#cricket
#amysatterthwaite
#leatahuhu
#southafrica

Free Traffic Exchange