Sailja Reddy Alludu Movie First Poster Released

2018-07-09 1,758

మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'శైలజారెడ్డి అల్లుడు'. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. చైతుకి అత్తగా.. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ చిత్రాల్లో ‘అల్లరి అల్లుడు' ఒకటి. ఆ సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఆయన తనయుడు నాగ చైతన్య నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం ఉంటుందని భావిస్తున్నారు.
ఒకప్పుడు తెలుగులో అత్త-అల్లుడు సబ్జెక్టుతో వచ్చిన స్టోరీలు బాక్సాఫీసు వద్ద ఓ రేంజిలో పేలాయి. తర్వాత ట్రెండ్ మారడంతో ఇలాంటి కథలతో వచ్చే సినిమాలు తగ్గాయి. చాలా కాలం తర్వాత మళ్లీ ఇలాంటి కాన్సెప్టుతో సినిమా వస్తుండటం, అత్తపాత్రలో పవర్ ఫుల్ గెటప్‌లో రమ్యకృష్ణ నటిస్తుండటం మరింత ప్లస్ అని చెప్పక తప్పదు.

The first look of the much-anticipated Telugu rom-com ‘Sailja Reddy Alludu’ starring Naga chaitanya, Anu Emmanuel, directed by Maruthi, released today. The teaser is expected to release in August.
#SailjaReddyAlludu
#AnuEmmanuel