సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'సంజు' మూవీ చూసిన వారంతా.... ఆయన రియల్ లైఫ్ ఫ్రెండ్ కమలేష్ కపాసి ఎవరు? ఎలా ఉంటారు? అని అన్వేషించడం మొదలు పెట్టారు. సంజయ్ జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో తండ్రి సునీల్ దత్ తర్వాత కమలేష్ కపాసి అని బయోపిక్‌లో చూపించడమే ఇందుకు కారణం. తెరపై ఈ పాత్రను విక్కీ కౌశల్ పోషించారు. సినిమాలో చూపించినట్లు సంజు రియల్ లైఫ్ ఫ్రెండ్ పేరు కమలేష్ కపాసి కాదు. ఆయన అసలు పేరు పరేష్ ఘిలానీ. 'సంజు' సినిమా చూసిన అనంతరం పరేష్ ఘిలానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ద్వారా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్
సంజు' చూసిన తర్వాత లిమిట్‌లెస్ ఎమోషన్స్‌తో నాకు మాట రాకుండా అపోయింది. వెంటనే సంజును గట్టిగా కౌగిలించుకుని ఏడవాలనిపించింది. నా మనసులో ఉన్న బాధనంతా బయటకు వెల్లగక్కాలనిపించింది' అని పరేష్ ఘిలానీ పేర్కొన్నారు.
‘సంజు' సినిమాలో కమలేష్ కపాసి పాత్ర గురించి వివరాల్లోకి వెళితే.... సంజయ్ దత్ తల్లి నర్గీస్ క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినపుడు కమలేష్ పరిచయం అవుతాడు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోతారు. డ్రగ్స్ బారిన పడిన సంజయ్‌ను వాటికి దూరం చేయడంలో కమలేష్ కపాసి పాత్ర ఎంతో కీలకం అని సినిమాలో చూపించారు.