Ram Charan Superb Speech at Rangasthalam 100 Days Celebrations

2018-07-09 1

రామ్ చరణ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, సమంత, అనసూయ ప్రధాన తారాగణంగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన 'రంగస్థలం' 100 రోజుల వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సినిమా సక్సెస్ అనేది వన్ మ్యాన్ డ్రీమ్... ఆ వన్ మ్యాన్ సుకుమార్. ఆయన ఆలోచన, రైటింగ్ నుండే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది అన్నారు. ఈ వేడుకలో అనసూయ తన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.
నాన్నగారు తిరిగి ఖైదీ నెం 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినపుడు ఓ విషయం గమనించాను... ఒక వ్యక్తికి ఇంత ఆదరణ, ప్రేమ కేవలం మంచి సినిమాల వల్లనో, గ్రేట్ క్యారెక్టర్ల వల్లనో రాదు. ఆయన ఒకటే అనేవారు... మనం ఎదిగేటపుడు మనతో పాటు పది మందిని పైకి తీసుకెళ్లాలి. ఒక వేళ మనం పడిపోతే ఆ పది మందే మనల్ని కాపాడుతారు అని చెప్పేవారు... మా ఇండస్ట్రీని, మమ్మల్ని కాపాడేవారు మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్... అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

Ram Charan Superb Speech at Rangasthalam 100 Days Celebrations. Rangasthalam 2018 Telugu Movie ft. Ram Charan, Samantha, Pooja Hegde, Anasuya and Aadhi Pinisetty. #Rangasthalam is Directed by Sukumar. Music by DSP / Devi Sri Prasad. Produced by Naveen Yerneni, Y Ravi Shankar and Mohan Cherukuri under Mythri Movie Makers banner.