రానున్న నాలుగైదు రోజుల్లో మధ్య భారత దేశం ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొంకణ్, గోవా, చత్తీస్‌గఢ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరామ్, త్రిపుర, తెలంగాణ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బంగాళాఖాతం వరకు అల్పపీడనం కొనసాగుతోంది. ఈ కారణంగా రానున్న నాలుగైదు రోజుల్లో మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
In its latest weather alert, the India Meteorological Department has warned of heavy to extremely heavy rainfall in over central belt of India for next 4-5 days.
#monsoon
#weather
#weatherforecast
#rains
#telangana